Saturday, September 27, 2025
E-PAPER
Homeఆటలుగోల్కొండ గోల్ఫ్‌ విజేత జమాల్‌

గోల్కొండ గోల్ఫ్‌ విజేత జమాల్‌

- Advertisement -

హైదరాబాద్‌: తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌ గోల్ఫ్‌ టోర్నీ విజేతగా జమాల్‌ హుస్సేన్‌ (బంగ్లాదేశ్‌) నిలిచాడు. ఎడతెగని వర్షం కారణంగా శుక్రవారం జరగాల్సిన తుది రౌండ్‌ పోటీలు రద్దు అయ్యాయి. దీంతో 54 హౌల్స్‌ స్కోర్ల ఆధారంగా విజేతను తేల్చారు. హైదరాబాద్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో మూడు రౌండ్లు ముగిసేసరికి 23-అండర్‌ 187(61-62-64) స్కోరుతో ముందంజలో ఉన్న జమాల్‌ను చాంపియన్‌గా నిలిచాడు. కెరీర్‌లో ఆరో టైటిల్‌ను ఖాతాలో వేసుకున్న జమాల్‌కు రూ.15 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. ఈ విజయంతో పీజీటీఐ 2025 ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌లో 14 నుంచి 10వ స్థానానికి ఎగబాకాడు. భారత్‌కు చెందిన అక్షయ్‌శర్మ, ఖలీన్‌ జోషి వరుసగా రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కష్ణారావు, హెచ్‌జీఏ ప్రెసిడెంట్‌ బివికె రాజులు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -