Saturday, September 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండాక్టర్ల అర్హతలు తనిఖీ చేసుకునే అవకాశం కల్పించాలి

డాక్టర్ల అర్హతలు తనిఖీ చేసుకునే అవకాశం కల్పించాలి

- Advertisement -

డాక్టర్‌ ఎం.రాజీవ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నిబంధనల ప్రకారం ప్రతి డాక్టర్‌ తమ కౌన్సిల్‌ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను స్పష్టంగా ప్రదర్శిస్తూ, ప్రజలకు డాక్టర్ల అర్హతలను మెడికల్‌ కౌన్సిల్‌ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకునే అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యులు డాక్టర్‌ ఎం.రాజీవ్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హత లేకుండా వైద్యం చేస్తున్న వారిపై, వారికి సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడం ప్రజారోగ్యానికే ప్రమాదమని ఆయన హెచ్చరించారు. డాక్టర్లు వారి సర్టిఫికెట్లను వారు నిజంగా ప్రాక్టీస్‌ చేస్తున్న ఆస్పత్రులకే ఇవ్వాలని ఆయన సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -