ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ చర్చలు
నవతెలంగాణ-మర్కుక్
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డితో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇటీవల మృతి చెందడంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అయింది. కాగా జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని సూచించారు. సునీత విజయమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థి ఎంపిక, నియోజకవర్గ వ్యూహాలు, విజయావకాశాలను పెంపొందించడానికి తీసుకోవలసిన చర్యలపై విస్తృతంగా చర్చ జరిగింది. పార్టీ బలాన్ని మరింత పెంచుతూ జూబ్లీహిల్స్‌లో విజయాన్ని సాధించడానికి సమన్వయంతో కృషి చేయాలని కేసీఆర్ సూచించినట్టు తెలిసింది.