నవతెలంగాణ-సూర్యాపేట
సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో నిరుద్యో గుల వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన ఆరోపణలపై ఆస్పత్రి ఏడీ (అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్) నెహ్రునాయక్, సీనియర్ అసిస్టెంట్ వేణును సస్పెండ్ చేసినట్టు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రకటిం చారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కమిటీ విచార ణలో ఆరోపణలు నిజమని తేలడంతో ఈ చర్యలు చేపట్టారు. నెలకు కేవలం రూ.16 వేలు జీతం వచ్చే ఉద్యోగాలకే లక్షల రూపాయలు ముడుపులు తీసుకున్నట్టు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం హైదారాబాద్ లేబర్ అండ్ ఎంప్లాయి మెంట్ జేడీ వద్దకూ చేరినట్టు సమాచారం. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా కలెక్టర్ అంతర్గత విచారణ ఆదేశించగా, అవకతవకలు రుజువై సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అర్హత లేని వారికి ఏజెన్సీలు కట్టబెట్టడం, ఐదు నెలలుగా జీతాలు రాక వందలాది అవుట్‌్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనలు చేస్తుండటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాల కోసం ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులను టార్గెట్ చేసి డబ్బులు దండుకున్న ఘటనపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES