Saturday, September 27, 2025
E-PAPER
Homeజాతీయంఒక్కో మహిళ అకౌంట్లో రూ.10వేలు

ఒక్కో మహిళ అకౌంట్లో రూ.10వేలు

- Advertisement -

ఎన్నికలకు ముందు తెరపైకి కొత్త స్కీమ్‌ ప్రారంభించిన ప్రధాని మోడీ

పాట్నా: ఇన్నాళ్లు మతరాజకీయాలతో నెట్టుకోచ్చిన బీజేపీ..ఇపుడు అలాంటి జిమ్మిక్కులు పనిచేయటంలేదు. తాజాగా బీహార్‌లోని ఎన్డీఏ భాగస్వామి నితీశ్‌ సర్కార్‌ మరోసారి గెలిపించటానికి ఎన్నికలకు ముందు తెరపైకి మరో పథకాన్ని తెరపైకి తెచ్చింది.బీహార్‌లో మహిళా సాధికారిత కోసం జేడీయూ, ఎన్డీఏ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కృషి చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వంలో మహిళలు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. త్వరలోనే బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజన పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించేందుకు రూ.7,500 కోట్లతో రూపొందించిన ఈ పథకాన్ని ప్రధాని ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున 75 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి డబ్బు జమ కానుంది. అనంతరం మాట్లాడిన మోడీ గతంలో ఆర్‌జేడీ పాలనలో మహిళలు చాలా బాధలు పడ్డారని, వారికి రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. వారి పాలనలో శాంతిభద్రతలు దయనీయంగా ఉండేవని డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వచ్చాక పరిస్థితులు మెరుగుపడ్డాయని అన్నారు. బీహార్‌లో మరోసారి ఆర్‌జేడీ అధికారంలోకి రాకుండా చూసుకోవాలని మహిళలకు ప్రధాని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -