- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారని శాసనమండలిలో మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన కర్నూలు, నంద్యాల జిల్లాలను సందర్శించనున్నారని తెలిపారు. ముందుగా శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనం అనంతరం కర్నూలులో కూటమి నేతలతో కలిసి రోడ్‌షోలో పాల్గొంటారు. అలాగే జీఎస్టీ సంస్కరణలపై మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భారీ ర్యాలీకి హాజరవుతారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి, ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారని చెప్పారు.
- Advertisement -