-పొంగిపొర్లుతున్నవాగులు
– ఇళ్లకే పరిమితమైన ప్రజలు
– రహదారులపై వరద రాకపోకలకు అంతరాయం
-స్తంభించిన జనజీవనం
నవతెలంగాణ-గండీడ్
గత రెండు రోజులుగా కురుస్తున్నభారీ వర్షానికి మండలంలోని చెరువులు,వాగులు పొంగిపొర్లుతున్నాయి.చెల్మిల్ల,చిన్నవార్వల్, కల్వర్టుల పైనుంచి నీరు పొంగిపోవడంతో రాకపోకలు ఆగిపోయాయి.పెద్దవార్వల్ నాగుల చెరువు అలుగు పారడంతో గత పది సంవత్సరాలుగా అలుగు పారని రాయికుంట శనివారం అలుగు పారడంతో చేపల వేటలో యువకులు నిమగ్నమయ్యారు.సాలార్ నగర్ ప్రాజెక్ట్ఉదృతంగా ప్రవహిస్తోంది.ప్రాజెక్ట్ లో చేపలు బయటికి వెళ్లకుండా పిల్లార్లతో జాలీలను ఏర్పాటు చేశారు.వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పైనుండి చెత్తాచెదారం జాలీలకు తట్టుకొని నీటి ప్రవాహాన్ని ఆపుతుందని తద్వారా ప్రాజెక్టు ఆనకట్టకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.అధికారులు స్పందించి అడ్డుగా ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని,వాగులు,చెరువుల దగ్గరకు వెళ్లరాదని,అధికారులు ప్రజలకు తెలియజేస్తున్నారు.
ముంచెత్తుతున్న వాన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES