నవతెలంగాణ – బిచ్కుంద
బిచ్కుంద ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని 10 వైన్స్ లకు రిజర్వేషన్ లు కేటాయిస్తూ 1 డిసెంబర్2025 నుండి 31 నవంబర్ 2027 రెండు సంవత్సరాలకుకు గానూ అక్టోబర్ 23న టెండర్ల కోసం నోటిఫికేషన్ విడుదలైనట్లు ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ ప్రకటన ద్వారా తెలిపారు. బిచ్కుంద మండలంలో ఒకటి, రెండు వైన్స్ లకు గాని ఓపన్ క్యాటగిరి, జుక్కల్ మండలంలోని రెండు వైన్స్లకు గాను ఒకటి గౌడ్స్ కులస్తులకు ఒకటి ఓపెన్ కేటగిరి కేటాయించారు. మద్నూర్ మండలంలోని రెండు వైన్స్ లకు గాను ఒకటి గౌడ్స్ కులస్తులకు ఒకటి ఓపెన్ క్యాటగిరి, పిట్లం మండలంలోని మూడు వైన్స్ లకుగాను ఒకటి గౌడ్ కులస్తులకు రెండు ఓపెన్ క్యాటగిరి, పెద్ద కొడప్ గల్ ఒక వైన్స్ ఉండగా ఓపెన్ క్యాటగిరికి కేటాయించారు. టెండర్ లో పాల్గొనేవారు అప్లికేషన్ రూపంలో మూడు లక్షలు ప్రభుత్వానికి చెల్లించి దరఖాస్తు చేసుకొని టెండర్ లో పాల్గొనాలని కామారెడ్డి లోని సిరిసిల్లరోడ్ లోగల శ్రీ రేణుకా దేవి కళ్యాణమండపంలో అక్టోబర్ 23న ఉదయం 11 గంటల నుండి డ్రా తీయబడుతుందని తెలిపారు.
వైన్స్ ల టెండర్ల కోసం నోటిఫికేషన్ విడుదల..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES