Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజకీయ పార్టీల ఉరుకులు.. పరుగులు

రాజకీయ పార్టీల ఉరుకులు.. పరుగులు

- Advertisement -

వెలువడిన రిజర్వేషన్లు ? అధికారిక ప్రకటనే ఆలస్యం
కొందరికి అదృష్టం.. మరికొందరు దురదృష్టం 
ఆర్డీవో కార్యాలయాల్లో రాజకీయ పార్టీల సందడి 
ఒక్కో గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి రిజర్వేషన్లు 
మరో సామాజిక వర్గం ఆశలపై నీళ్లు 
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం 

ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వెలువడుతున్న నేపథ్యంలో రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా ఆర్డీవో కేంద్రాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ బీసీ మహిళ, మంచాల జెడ్పీటీసీ ఎస్టి జనరల్,  యాచారం జెడ్పీటీసీ బీసీ జనరల్, అబ్దుల్లాపూర్మెట్ జనరల్, మాడ్గుల జనరల్ కు రిజర్వు చేశారు. ఇదిలా ఉంటే ఇబ్రహీంపట్నం ఎంపీపీ స్థానాన్ని బీసీ మహిళ, మంచాల ఎస్టీ జనరల్, యాచారం జనరల్, అబ్దుల్లాపూర్మెట్ జనరల్ కు చేశారు.

ఈ రిజర్వేషన్లను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఉరుకులు, పరుగులు పెడుతున్నాయి. ఆయా గ్రామాల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు రిజర్వేషన్లపై ఆరా తీసేయడమే కాకుండా పోటీలో నిలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తమ అధినాయకత్వం వద్ద తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని వేడుకుంటున్నారు. రాజకీయ పార్టీలు గెలుపోటములపై అంచనాలు వేసుకుంటున్నారు. 

రిజర్వేషన్లు ఇలా..

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లా పూర్ మెట్ మండలాల రిజర్వేషన్లు ప్రక్రియను పరిశీలిస్తే.. ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ స్థానం బీసీ మహిళకి రిజర్వు చేశారు. యాచారం జెడ్పీటీసీ స్థానాన్ని బీసీ జనరల్ కు రిజర్వు కాగా,  మంచాల జెడ్పీటీసీ స్థానం ఎస్టీకి రిజర్వ్ చేశారు. అబ్దుల్లాపూర్మెట్లు మండలం స్థానం జనరల్ కు రిజర్వు చేశారు. 

సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లు 

ఇబ్రహీంపట్నం మండలంలోని సర్పంచుల రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి. చెర్ల పటేల్ గూడ బీసీ జనరల్, దండుమైలారం జనరల్, వెలిమినేడు ఎస్సి మహిళ, కప్పాడు ఎస్సి జనరల్, కర్ణంగూడ జనరల్ మహిళ, ముకునూరు బీసీ జనరల్, నాయనంపల్లి బీసీ జనరల్, నెర్రపల్లి జనరల్ మహిళ, పోచారం ఎస్సి జనరల్, పోల్కంపల్లి బీసీ మహిళ, రాయపోలు బీసీ మహిళ, తుర్కగూడ జనరల్, తూలికలాన్ బీసీ మహిళ, ఉప్పరిగూడ ఎస్సీ మహిళా రిజర్వ్ చేశారు. 

ఇబ్రహీంపట్నం ఎంపీటీసీ రిజర్వేషన్లు..

ఇబ్రహీంపట్నం మండలంలోని ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లను పరిశీలిస్తే.. చర్ల పటేల్ గూడ బీసీ మహిళ, దండు మైలారం ఒకటి జనరల్,  రెండు బీసీ మహిళ, ఎలిమినేడు ఎస్సీ మహిళా, కప్పాడు ఎస్సీ జనరల్, పోచారం బీసీ మహిళ, పోల్కంపల్లి జనరల్, రాయపోలు ఒకటి జనరల్ మహిళ, రాయపోలు రెండు ఎస్సీ జనరల్, తులేకలాన్ బీసీ జనరల్ కు రిజర్వ్ చేశారు. 

మంచాల మండల సర్పంచ్ రిజర్వేషన్లు..

మంచాల మండలంలోని సర్పంచ్ రిజర్వేషన్లు ఈ విధంగా ఉన్నాయి. ఆరుట్ల ఎస్టి మహిళ, జాపాల్ ఎస్సీ జనరల్, చీదేడు బీసీ మహిళ, దాదుపల్లి ఎస్టి మహిళ, మంచాల ఎస్సీ మహిళా, ఆగపల్లి ఎస్సీ జనరల్, కాగజ్ గట్ బీసీ జనరల్, అస్మత్పూర్ బీసీ మహిళ, రంగాపూర్ ఎస్టీ జనరల్, నోముల బీసీ జనరల్, లింగంపల్లి బీసీ జనరల్, చిత్తాపూర్ బీసీ మహిళ, తాళ్లగూడ ఎస్సీ మహిళ, తిప్పాయిగుడ బీసీ మహిళ, బండలేమూరు ఎస్టి జనరల్, చెన్నారెడ్డిగుడా బీసీ జనరల్, లోయపల్లి ఎస్టి జనరల్, పిసీతండా ఎస్టీ మహిళ, బోడకొండ జనరల్ , ఆంబోతుతండా బీసీ జనరల్, కొర్రవానితండా జనరల్ మహిళ, సత్యంతండా జనరల్ మహిళ, ఎల్లమ్మ తండా జనరల్ రిజర్వ్ చేశారు. 

మంచాల మండలం ఎంపీటీసీ స్థానాలు..

మంచాల మండలంలోని ఎంపీటీసీ స్థానాలను పరిశీలిస్తే.. ఆరుట్ల ఎస్సి జనరల్, ఆరుట రెండు జనరల్ మహిళ, జాపాల బీసీ మహిళ, దాద్ పల్లి ఎస్టి జనరల్, మంచాల ఎస్సీ మహిళా, ఆగపల్లి బీసీ జనరల్, లింగంపల్లి బీసీ మహిళా, తాళ్లపల్లి గూడా బీసీ జనరల్, బండలేమూరు ఎస్టి మహిళ,  చెన్నారెడ్డి గూడ బీసీ జనరల్, లోయపల్లి ఎస్టి జనరల్, బోడకొండ జనరల్, ఆంబోతుతండా జనరల్ కు రిజర్వ్ చేశారు.

యాచారం మండల సర్పంచ్ రిజర్వేషన్లు..

యాచారం బీసీ మహిళ, ధర్మన్నగూడ ఎస్సీ మహిళ,  నందివనపర్తి బీసీ, అయ్యవారిగూడ ఎస్టి, నాజ్దిక్ సింగారం ఎస్సీ మహిళా, కుర్మిద్దా  జనరల్ మహిళ, తాడిపర్తి బీసీ, నానక్ నగర్ ఎస్సీ మహిళ, తక్కళ్ల పల్లి – ఎస్సీ, కొత్తపల్లి బీసీ మహిళ, తక్కళ్లపల్లి తండా  ఎస్టి మహిళ, మాల్ – జనరల్, మంథన్‌గౌరెల్లి ఎస్టి, మేడిపల్లి ఎస్సీ మహిళా, కేస్లీ తండా ఎస్టీ మహిళ, నల్లవెల్లి జనరల్, చింతపట్ల బీసీ, మల్కిజ్‌గూడ బీసీ, మొండి గౌరెల్లి జనరల్ మహిళ, చౌదర్ పల్లి బీసీ మహిళా,  చింతుల్లా  ఎస్సీ, గుంగల్ -ఎస్సీ, గడ్డమల్లయ్యగూడ బీసీ మహిళ, తమ్మలోని గూడ బీసీలకు రిజర్వు చేశారు. 

యాచారం ఎంపీటీసీ రిజర్వేషన్లు..

కొత్తపల్లి ఎస్టీ జనరల్, గున్ గల్ ఎస్సీ జనరల్, మాల్ ఎస్సీ జనరల్,  నందివనపర్తి ఎస్సీ జనరల్,  యాచారం ఎస్సీ మహిళా, చింతపట్ల బీసీ జనరల్, మేడిపల్లి బీసీ జనరల్,  తులేకుర్ధు బీసీ జనరల్, చౌదర్పల్లి బీసీ మహిళ,  కుర్మిద్ద బీసీ మహిళ, తాడిపర్తి బీసీ మహిళ, మంథన్ గౌరిల్లి జనరల్,  నల్లవెల్లి జనరల్, మల్ కిస్ గూడ జనరల్ కు రిజర్వ్ చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -