సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబుల చిత్రపఠాలకు పాలాభిషేకం
నవతెలంగాణ – మల్హర్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం బిసి రిజర్వేషన్ కోసం ప్రత్యేక జీవో తీసుకొచ్చి 42 శాతం ప్రకటించడం చారిత్రాత్మకమని ఓబీసీ జిల్లా నాయకుడు విజయగిరి సమ్మయ్య అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఓబీసీ నాయకులు మండలం కొయ్యూరు చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బిసి శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బిసిలకు దక్కిన రాజకీయ గుర్తింపుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమేన్నారు. ఓబిసి పక్షాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చిన హామీ ప్రకారము స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ జీవో కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ నాయకులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ చారిత్రాత్మకం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES