నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఇంచార్జ్ ప్రిన్సిపాల్ మధు కుమార్ ఆధ్వర్యంలో అధ్యాపకురాలు వైష్ణవి, విద్యార్థినులతో పూలను పేర్చి బతుకమ్మను తయారు చేశారు. కళాశాల మైదానంలో అందమైన ముగ్గులు వేసి, ఆటపాటలతో అలరించారు. కోలాటాలు వేస్తూ బతుకమ్మ పాటలు పాడుతూ సాంస్కృతిక నృత్యాలతో విద్యార్థినిలు ఆనందంతో పరవశించి పోయారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి గ్రామ శివారులోని చెరువుల బతుకమ్మలను నిమజ్జనం చేశారు. విద్యార్థులను ఉద్దేశించి ఇంచార్జి ప్రిన్సిపల్ మధు కుమార్ మాట్లాడుతూ .. తెలంగాణలో ఆడపడుచులు అద్భుతంగా జరుపుకునే ఉత్సవం ఈ బతుకమ్మ పండుగ అన్నారు.
ఆడవారు శక్తిమాత గౌరమ్మను నవరాత్రులు పూజించి, అమ్మవారి ఆశీస్సులను పొంది, వచ్చే ఏడాది వరకు అష్టైశ్వర్యాలను అందించి మమ్మల్ని చల్లగా కాపాడుమని వేడుకొని బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు. ప్రకృతిలో లభించే పూలను సైతం పూజించే సాంప్రదాయం హైందవ సంస్కృతిలోనే ఉందన్నారు. కార్యక్రమంలో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ మధు కుమార్, అధ్యాపకులు వెంకటేష్,రాజ్ కుమార్, వైష్ణవి, గంగాధర్, మహేందర్, శ్రీహరి, మురళీకృష్ణ , స్వాతి, సుమతి, స్రవంతి, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబురాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES