Saturday, September 27, 2025
E-PAPER
Homeఖమ్మంవ్యవసాయం సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు చేరువ చేస్తాం

వ్యవసాయం సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు చేరువ చేస్తాం

- Advertisement -

– పత్రీ రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకునేలా సభ్యుల కృషి
– రైతు వేదికలో మౌళిక సదుపాయాలకు తీర్మానం
– బీఎఫ్ఏసీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట

వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించేందుకు బీఎఫ్ఏసీ సభ్యులు కృషి చేయలని చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు అన్నారు. ఇటీవల రూపుదిద్దుకున్న ఆత్మ (వ్యవసాయ సాంకేతిక నిర్వహణ సంస్థ) అనుబంధ బీఎఫ్ఏసీ (బ్లాక్ లెవల్ ఫార్మర్స్ అడ్వైజరీ కమిటీ) పాలక వర్గం ప్రధమ సమావేశం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని రైతు వేదికలో శనివారం వ్యవసాయ శాఖ అశ్వారావుపేట సహాయ సంచాలకులు పెంట్యాల రవి కుమార్ అద్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా చైర్మన్ సుంకవల్లి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి రైతు తమ భూమికి సంబందించిన గుర్తింపు కార్డు కొరకు ఫార్మర్స్ రిజిస్ట్రీ లో నమోదు చేసుకోవలసి ఉంది అని,రిజిస్ట్రేషన్  చేసుకోని రైతులను బీఎఫ్ఏసీ( రైతు సలహా కమిటీ  )సభ్యులు ప్రోత్సహించింది రిజిస్ట్రేషన్ కు తోడ్పడాలని సూచించారు.

ఏడీఏ రవికుమార్ మాట్లాడుతూ.. అశ్వారావుపేట నియోజక వర్గంలో( డివిజన్) 64 శాతం కు పైగా  ఎస్టీ రైతులు ఉన్నారని,1,88,079 ఎకరాల సాగు విస్తీర్ణంలో వరి,పత్తి,ఆయిల్ ఫాం తదితర పంటలు పండిస్తున్నారు అని అన్నారు.భూసారాన్ని పెంపొంది చేందుకు వానాకాలం పంటల సాగుకు మందు పచ్చిరొట్ట పైర్లు సాగు చేయడం జరిగింది అని తెలిపారు. రైతు బరోసా లో భాగంగా ఈ వానాకాలంలో 48305   మంది రైతుల ఖాతాల్లో రూ. 91.91 కోట్లు జమ అయ్యాయని అన్నారు.

2024 – 2025  సంవత్సరంలో రైతు భీమా పధకం తో వివిధ కారణాలతో మరణించిన  215 మంది రైతులకు  వారి నామినీ బ్యాంకు ఖాతాల్లో రూ.5 లక్షల చొప్పున రూ.10 కోట్ల 75 లక్షలు జమ అయ్యాయి అన్నారు. జాతీయ ఆహార భద్రత –  పోషణ మిషన్ ద్వారా రాయితీ పై మినుము విత్తనాలు పంపిణీ చేయడం వలన మినుము సాగ 2024 లో 824 ఎకరాల్లో ఉండగా ఈ వానాకాలంలో 1483 ఎకరాలకు విస్తరించింది అని అన్నారు సభ్యులకు వివరించారు. రైతు వేదికలో ప్రతి మంగళవారం జరిగే రైతు నేస్తం కార్యక్రమంలో తోటి రైతులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చేసి లబ్ది పొందాలని సూచించారు.

రైతు వేదికలో మౌళిక సదుపాయాల కల్పనకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ,జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో రైతు సలహా రాష్ట్ర కమిటీ సభ్యులు దుబ్బాకుల  రాము,జిల్లా కమిటీ సభ్యులు పగడాల కృష్ణారావు పాలకవర్గం సభ్యులు, అశ్వారావుపేట,చండ్రుగొండ మండల వ్యవసాయ శాఖ అధికారులు శివరాం ప్రసాద్,వినయ్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -