Sunday, September 28, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా కొండా లక్ష్మన్ బాపూజీ జయంతి..

ఘనంగా కొండా లక్ష్మన్ బాపూజీ జయంతి..

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
మండల కేంద్రంతో పాటు ఆయాగ్రామలోని పద్మ శాలి సంఘ భవనాల్లో శనివారం అచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడరూ.. పద్మ శాలి ముద్దు బిడ్డ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసి స్వాతంత్ర్య సమరయోధులు, తెలంగాణ ఉద్యమ నేత నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు బాపూజీ, తొలి మలిదశ తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్ర కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మహా వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పద్మ శాలి సంఘం మండల అధ్యక్షులు సామల వీరయ్య,గ్రామ అద్యక్షులు లక్ష్మీ నారాయణ, భీమలింగం, నవీన్, మురళీ, కిష్టయ్య, పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -