Sunday, September 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలునిజాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న భారీ వరద

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న భారీ వరద

- Advertisement -

నవతెలంగాణ-నిజాంసాగర్
ఎక్కువ ప్రాంతాలతో పాటు జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు శనివారం కురిసిన భారీ వర్షానికి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద కొనసాగుతుంది. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్టులోకి 107,363 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరగా.. 15 వరద గేట్లు ఎత్తి మంజీరా నదిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మంజీరా నదిలోకి 1,09,351 క్యూసెక్కుల నీటిని, ప్రధాన కాలువ ద్వారా 1,250 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్టు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్, అక్షయ్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం ప్రాజెక్టులో 12.942 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు చెప్పారు. కాబట్టి కాలువ,నది పరివాహక ప్రాంతలలోనీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -