నవతెలంగాణ – కట్టంగూర్
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామాల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ జిల్లా జి ఈ టి సభ్యులు ఎర్ర శంభు లింగారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఈదులూరు గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ముగ్గురు ఆర్ఎంపీ వైద్యులు 150 మంది రోగులకు బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. క్లబ్ సభ్యులు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు చిక్కు శేఖర్ ఉపాధ్యక్షుడు రెడ్డిపల్లి సాగర్, క్లబ్ సభ్యులు తవిడబోయే నరసింహ మద్ది ఉపేందర్ రెడ్డి ఆర్ఎంపి వైద్యులు సాంబయ్య, భవాని, ప్రసాద్, వెంకన్న ఉన్నారు.
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES