- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జడ్పీహెచ్ఎస్ స్కూల్ గ్రౌండ్ ఆవరణంలో ఏర్పాటుచేసిన దుర్గామాతకు అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి యాదగిరి లక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. అమ్మవారికి పెద్ద మంగళహారతి, రూ.5 వేల నగదుతో అమ్మవారిని అలంకరించారు. మహిళలు ఆలయం వద్దకు చేరుకొని బతకమ్మ ఆడారు. గ్రామ ప్రజలు, భక్తులు ,మహిళలు పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
- Advertisement -