Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్2024 జనాభా లెక్కలు బీసీ వర్గానికేనా..!

2024 జనాభా లెక్కలు బీసీ వర్గానికేనా..!

- Advertisement -

– స్థానిక ఎన్నికల్లో మిగతా వర్గాలకు అన్యాయం 
– ఆర్డీవో కార్యాలయం ఎదుట గిరిజన సంఘాల నాయకుల ఆందోళన 
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 

బీసీలకు 42% రిజర్వేషన్ల ను 2024 ప్రకారం కనిపిస్తూ  గిరిజనులకు, లంబాడీలకు మిగతా వర్గాలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారని అన్ని వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చేస్తూ శనివారం హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట నియోజకవర్గం పరిధిలోని, అన్ని మండలాల గిరిజన సంఘాలు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు తిరుపతి నాయక్ మాట్లాడుతూ  2024 జనాభా లెక్కల ప్రకారం ఇవ్వవలసిన రిజర్వేషన్ లను మోసం చేస్తూ ఒకే వర్గానికి 42 శాతం  కేటాయించడం చాలా సిగ్గుచేటన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి,  మంత్రి పొన్నం ప్రభాకర్ కేవలం తమ స్వార్థం కోసం ఒక వర్గానికి చెందిన వాళ్లకి రిజర్వేషన్ల పేరుతో సీట్లను కేటాయిస్తూ అధికారాన్ని కట్టబెట్టడానికి భారీ కుట్ర చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం బిసి వాదాన్ని వాడుకుంటున్నారన్నారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలను పక్కనపెట్టి రిజర్వేషన్ల పేరుతో సొంత మేనిఫెస్టో తయారు చేసుకొని అక్రమ మార్గంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారా అని అన్నారు .స్థానిక సంస్థల ఎన్నికలలో ముఖ్యంగా నష్టపోతున్న వర్గం ఏదైనా ఉంది అంటే అది గిరిజనులు, లంబాడీలు అన్నారు.

ఇంతకుముందు లంబాడీలను, గిరిజనులను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచనతో అతిపెద్ద కుట్ర చేసి గిరిజన ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ముందుకు సాగుతుందన్నారు.ఆ సమస్యను అలానే పెంచి పోషిస్తూ, ఆదివాసి, గిరిజనుల లంబాడీల మధ్య గొడవను సృష్టిస్తూ వస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఉన్న గిరిజనులు, లంబాడ ప్రజలు ఏకాభిప్రాయంతో ముందుకు సాగి, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అన్ని విధాలుగా అడ్డుకుంటామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మా వంతుగా వచ్చే  సర్పంచ్, ఎంపిటిసి, ఎంపీపీ, జెడ్పిటిసి స్థానాలను కాపాడుకునే వరకు తీవ్రమైన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రస్థాయిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారం నుండి తొలగించేంతవరకు పోరాడుతామన్నారు. తమ హక్కులను కొల్లగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -