Sunday, September 28, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా కొండ లక్ష్మణ్ బాపుజి జయంతి వేకలు

ఘనంగా కొండ లక్ష్మణ్ బాపుజి జయంతి వేకలు

- Advertisement -

 నవతెలంగాణ జన్నారం:

స్వాతంత్ర్య సమరయోధుడు దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను మండలంలో పద్మశాలి సంఘం ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ ఆలయం వద్ద పద్మశాలి కుల భాందవులందరు బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మండల పద్మశాలి, బిసి సంఘ నాయకులు మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపుజి నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడని, 1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కూడా శాసనసభ్యుడిగా నుంచి ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగాడని నిఖార్సయిన తెలంగాణ వాది అని అన్నారు. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త, ఉద్యమాలలో పాల్గొన్నాడని, రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా కృషి చేశాడని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు చెటుపల్లి గంగయ్య, పొనకల్ పట్టణాధ్యక్షులు చెటుపల్లి క్రిష్ణ, నాయకులు అయ్యోరి శ్రీనివాస్, చెటుపల్లి సత్యం, సాంబారి అంజన్న, ఆడెపు లక్ష్మినారాయణ, బైరి లక్ష్మినారాయణ, నరేందర్, కందుల రమేష్, చెటుపల్లి రాజమౌళి, గోనె సత్యం, బాలిన మదు, రాము, పోతు వేణు, రాజు లసెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -