నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అధ్యక్షతన గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా వార్డు సభ్యుల రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ కేటాయింపుపై చర్చించారు. అనంతరం అన్ని రాజకీయ పక్షాల సమక్షంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ స్థానాలలో మహిళా రిజర్వేషన్ కొరకు లాటరీ పద్ధతిలో రిజర్వేషన్ ఖరారు చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. మొత్తం 138 వార్డులకు ఒక్కో కేటగిరీలో ప్రభుత్వ నిర్దేశిత నియమాల మేరకు మహిళలకు రిజర్వేషన్ల కేటాయింపు జరిగినట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో తహసిల్దార్ గుడిమేల ప్రసాద్, మండల పంచాయతీ అధికారి సదాశివ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, బిఆర్ఎస్ నాయకులు మైలారం సుధాకర్, బిజెపి మండల అధ్యక్షులు బద్దం రమేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
లాటరీ పద్ధతిలో మహిళలకు రిజర్వేషన్ల కేటాయింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES