జిల్లా బీసీ సంఘం గౌరవ అధ్యక్షులు, న్యాయవాది గొట్టిపాముల బాబురావు
నవతెలంగాణ – భువనగిరి
కొండ లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా శనివారం భువనగిరి పట్టణ కేంద్రం లోని జిల్లా బీసీ సంగం గౌరవ అధ్యక్షులు, న్యాయవాది గొట్టిపాముల బాబురావు ఆధ్వర్యంలో ఆయన ఫోటోకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. కొండ లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహా నాయకులన్నారు. భువనగిరి నియోజకవర్గానికి మొదటి ఎమ్మెల్యేగా హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాల వారికోసం కృషి చేసిన గొప్ప వ్యక్తిఅని కొనియాడారు.
కార్మికులు,కష్టజీవుల కోసం ఎంతగానో తపించి వారి యొక్క అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని1969లో మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి స్ఫూర్తిని నింపారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఎలాంటి పదవిని తీసుకోకుండా పోరాటం చేసిన నిస్వార్థ అభ్యుదవాదిఅని అన్నారు.ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ప్రజల కోసం పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మెరుగు మధు, మాటూరి అశోక్, చింతకింది శ్రీధర్, శ్రీరామ్ సత్తయ్య, కస్తూరి శివ పాల్గోన్నారు.
ఉద్యమ స్ఫూర్తికి నిలువెత్తు సాక్ష్యం కొండా లక్ష్మణ్ బాపూజీ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES