నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల రజక కమిటీ అధ్యక్షులు శ్రీపతి దత్తు ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం మండల కేంద్రంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రజకులు సమావేశం ఏర్పాటు చేసుకొని మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీ పత్తి దత్తును ఎన్నుకోగా, ఉపాధ్యక్షులుగా గంగాధర్, బాబయ్య, గంగాధర్, వోల్ల బాబయ్య, ప్రధాన కార్యదర్శి కలిగోట ప్రదీప్, కోశాధికారి దుబ్బాక గంగారం, సలహాదారులుగా బాబు శరత్, గంగాధర్, ఈసీ మెంబర్స్ గా కోరట్ పల్లి నర్సయ్య ,మోహన్ చాకలి, కల్లు గంగారం తోపాటు తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. మండలంలో రజకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.మపై విశ్వాసం ఉంచి భాద్యతలను అప్పజేప్పిన మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన రజకులకు ధన్యవాదాలు తెలిపారు.అనంతరం నూతన కమిటీ కి పూల మాలలతో సత్కరించి సన్మానించారు.
ఇందల్ వాయి మండల రజక కమిటీ అధ్యక్షులుగా శ్రీపతి దత్తు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES