- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం దూపల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గత వారం రోజులుగా వివిధ రకాలైన పూలను సేకరించి ఒకరిపై మరి ఒకరి పోటీపడుతూ బతుకమ్మలను తయారు చేశారు. గ్రామంలోని మహిళలందరూ ఒకే చోట బతుకమ్మలను వాడడం పలువురిని ఆకర్షించింది. ప్రతి సంవత్సరం ఈ వేడుకలను గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు.
- Advertisement -