Sunday, September 28, 2025
E-PAPER
Homeసినిమావిలనిజాన్ని తిరగరాసే శికంజా మాలిక్‌

విలనిజాన్ని తిరగరాసే శికంజా మాలిక్‌

- Advertisement -

చాలా కాలం తరువాత అగ్రకథానాయకుడు మోహన్‌బాబు మరోసారి పవర్‌ఫుల్‌ ప్రతినాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హీరో నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్‌’. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రమిది. ఇందులో ‘జడల్‌’ క్యారెక్టర్‌లో ఇప్పటివరకు కనిపించని తీరులో నాని కనిపించనుండగా, పవర్‌ఫుల్‌ విలన్‌ శికంజ మాలిక్‌గా మోహన్‌బాబు నటిస్తున్నట్లు మేకర్స్‌ శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా శికంజ మాలిక్‌గా మోహన్‌బాబు లుక్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.
‘శికంజ మాలిక్‌.. బ్రూటల్‌, మ్యాడ్‌ మ్యాన్‌, స్వాగ్‌, స్టైల్‌, యూనిక్‌.. అతడు విలనిజాన్ని పునర్‌ నిర్వచించడానికే కాదు, పూర్తిగా తిరగరాసేందుకు వస్తున్నాడు’ అంటూ పోస్టర్స్‌లో మేకర్స్‌ పేర్కొన్నారు.
‘షర్ట్‌ లేకుండా గన్‌, కత్తి పట్టుకుని సిగార్‌ కాలుస్తూ రగ్గడ్‌గా ఉన్న ఇంటెన్స్‌ లుక్‌, అలాగే రెట్రో అవతార్‌లో సిగార్‌ కాలుస్తూ భుజంమీద గన్‌ పెట్టుకొని స్వాగ్‌తో నడుచుకుంటూ వస్తున్నట్లు ప్రజెంట్‌ చేసి లుక్స్‌ అద్భుతమైన రెస్పాన్స్‌తో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పవర్‌, ఇంటెన్సిటీ, స్టైల్‌తో క్రాఫ్ట్‌ చేసిన ఈ పాత్రలో మోహన్‌బాబు ప్రత్యేకతైన పంచ్‌ డైలాగ్స్‌, మేనరిజమ్స్‌ ఫ్యాన్స్‌కి పండగలా ఉండబోతున్నాయి. ‘డైలాగ్‌ కింగ్‌’ ఇమేజ్‌కు తగిన విధంగా ఆయన మెస్మరైజ్‌ చేయబోతున్నారు. ఈ పాత్ర విన్న వెంటనే మోహన్‌బాబుని అద్భుతంగా ఆకట్టుకుంది, వెంటనే అంగీకరించారు. తన కోసం రాసిన పాత్ర విన్న తర్వాత దర్శకుడు శ్రీకాంత్‌ అభిమానిగా మారిపోయారు’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీ, ఇంగ్లీష్‌, స్పానిష్‌ భాషల్లో విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -