– కాపాడబోయి మరొకరు మృతి
– హుజూర్‌నగర్ పట్టణపరిధిలో ఘటన
నవతెలంగాణ-హుజూర్ నగర్
ప్రమాదవశాత్తు ఒకరు కాలు జారి బావిలో పడి మునిగిపోతుండగా మరొకరు కాపాడబోయి ఇద్దరూ మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణపరిధిలో శుక్రవారం జరిగింది. హుజూర్‌నగర్ ఎస్‌ఐ జి.ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కన్మనూర్ తిరుపతయ్య, మేదిపురం లక్ష్మణ్ (21).. మరో ఆరుగురితో కలిసి వారి స్వగ్రామం నుంచి గొర్రెలను మేపుకుంటూ హుజూర్‌నగర్ పట్టణానికి వచ్చారు. పది రోజుల నుంచి హుజూర్‌నగర్ పట్టణానికి చెందిన జక్కుల లింగయ్య పొలంలో మేత కోసం గొర్రెలను ఆపి ఆ పొలంలోనే ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం తిరుపతయ్య ఇద్దరు కుమారులు శేఖర్ (14), చరణ్.. వేసవి సెలవులు అయినందున తండ్రి వద్దకు వచ్చారు. శుక్రవారం ఉదయం తిరుపతయ్య పెద్ద కుమారుడు శేఖర్, లక్ష్మణ్.. సమీపంలోని లింగయ్య బావిలో నీళ్లకోసం వెళ్లారు. లక్ష్మణ్ నీళ్లు పట్టడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి మునుగుతుండగా, శేఖర్ అతన్ని కాపాడటానికి ప్రయత్నిస్తుంచి.. అతను కూడా బావిలో పడ్డాడు. దాంతో ఇద్దరూ నీట మునిగి చనిపోయారు. శేఖర్ తండ్రి తిరుపతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
బావిలో మునిగి ఒకరు..
- Advertisement -
- Advertisement -