శీతల్, తోమర్‌కు పసిడి
దీప్తి జీవాంజి సిల్వర్ షో
పారిస్ ఒలింపిక్స్ పతక విజేత, భారత స్టార్ పారా అథ్లెట్ దీప్తి జీవాంజి ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్‌లో మూడో స్థానంలో నిలిచిన దీప్తి.. న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రెండో స్థానం సాధించింది. శనివారం జరిగిన మహిళల 400 టీ20 రేసును దీప్తి జీవాంజి 55.16 సెకండ్లలో ముగించింది. అర్హత రౌండ్‌లో 58.35 సెకండ్లతో మెరిసిన దీప్తి.. కెరీర్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్స్) స్కీమ్‌లో దీప్తి జీవాంజి సహకారం అందుకుంటుంది.
ఆర్చరీలో శీతల్ దేవి (18) పసిడి గురి ఎక్కుపెట్టింది. మహిళల కాంపౌండ్ విభాగంలో వరల్డ్ నం.1 టర్కీ ఆర్చర్‌ను శీతల్ దేవి 146-143తో ఓడించింది. 18 ఏండ్లలోనే ప్రపంచ పారా చాంపియన్‌గా నిలిచింది. మెన్స్ కాంపౌండ్ విభాగం ఫైనల్లో తోమర్ కుమార్ బంగారు పతకం సాధించగా, రాకేశ్ కుమార్ రజతం దక్కించుకున్నాడు. ఫైనల్లో రాకేశ్ విల్లు టెన్నికల్ సమస్య ఎదుర్కొగా.. పోటీ నుంచి తప్పుకున్నాడు. మెన్స్ టీ42-టీ63 హైజంప్‌లో శైలేష్ కుమార్ 1.91 మీటర్ల జంప్‌తో బంగారు పతకం సాధించగా.. 1.85మీతో వరుణ్ సింగ్ కాంస్య పతకం దక్కించుకున్నాడు.