Saturday, May 10, 2025
Homeబీజినెస్రెట్టింపైన స్విగ్గీ నష్టాలు

రెట్టింపైన స్విగ్గీ నష్టాలు

- Advertisement -

బెంగళూరు : ప్రముఖ ఫుడ్‌ డెలివరీ వేదిక స్విగ్గీ భారీ నష్టాలను చవి చూసింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 1,081.18 నికర నష్టాలు చవి చూసింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ4లోని రూ.554.77 కోట్ల నష్టాలతో పోల్చితే 94 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. ఇదే సమయంలో రూ.3,046 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ4లో 45 శాతం పెరిగి రూ.4,410 కోట్లకు చేరాయి. ఆర్థిక సంవత్సరం 2024-25లో స్థూలంగా రూ.3,177 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఇంతక్రితం 2023-24లోని 2,350 నష్టాలతో పోల్చితే 33 శాతం పెరగడం గమనార్హం. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ సగటు ఆర్డరు విలువ 13.3 శాతం మేర పెరిగి రూ.526కు చేరినట్లు స్విగ్గీ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -