బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.1,50 కోట్ల దోపిడీ కోసమే హైదరాబాద్ ప్రజలను మూసీ వరదలో ముంచారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ఆరోపించారు. శనివారం కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌కు వరద ముప్పును తగ్గించేందుకు వందేళ్ల కిందట నిజాం ప్రభుత్వం నిర్మించిన ఉస్మాన్ సాగర్, గండిపేట చెరువులను వాతావరణ శాఖ హెచ్చరికలు రాగానే ఖాళీ చేసి మూసీ వరద నీటిని నిల్వ చేయాల్సి ఉంటుందని గుర్తుచేశారు. కానీ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో దోపిడీకి పాల్పడేందుకు ఆ ప్రాజెక్టును ఎలాగైనా పూర్తి చేయాలన్న దురుద్దేశంతో రేవంత్ రెడ్డి ఆ చెరువులను ఖాళీ చేయించలేదని ఆరోపించారు. అందుకే చరిత్రలో తొలిసారిగా ఇమ్లిబన్ బస్టాండ్‌ను వరద ముంచెత్తిందని తెలిపారు. కొడంగల్‌లో వస్తున్న వ్యతిరేకతను గుర్తించిన రేవంత్ రెడ్డి, రాబోయే ఎన్నికల్లో వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమన్నారు. కేసీఆర్ కట్టించిన భవనాలు, ఫ్లై ఓవర్లు, బ్రిడ్జిలకు రిబ్బన్ కట్ చేయడానికి రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డిలు జేబులో కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. అల్లుడి ఫ్యాక్టరీ కోసం భూములు గుంజుకుని రైతుల పొట్టగొడుతుంటే చూస్తూ ఊరుకోబోమని, ”కొడంగల్ ఏమైనా రేవంత్ జాగీరా?” అని కేటీఆర్ ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యంతోనే మూసీకి వరదలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES