Sunday, September 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమోడల్‌ స్కూల్‌ సంఘాల ఐక్య వేదిక ఏర్పాటు

మోడల్‌ స్కూల్‌ సంఘాల ఐక్య వేదిక ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఏర్పాటైంది. శనివారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయ సంఘాల సమావేశాన్ని టీఎస్‌ఎంఎస్‌టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు బి కొండయ్య అధ్యక్షతన నిర్వహించారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ మోడల్‌ స్కూల్‌ సంఘాల ఐక్యవేదికను ఏర్పాటు చేసుకున్నారు. స్టీరింగ్‌ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. మోడల్‌ స్కూల్‌ టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలను చెల్లించాలని ఆ సమావేశం డిమాండ్‌ చేసింది. నోషనల్‌ సర్వీస్‌, పెండింగ్‌ బకాయిల చెల్లింపు, కారుణ్య నియామకాలు చేపట్టాలనే అంశాలపై చర్చించింది. ఐక్య వేదిక రెండో సమావేశంలో కార్యాచరణను ప్రకటించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ విఠల్‌, ఎంఎస్‌యూటీఏ రాష్ట్ర అధ్యక్షులు టి అరవింద్‌ గోష్‌, ప్రధాన కార్యదర్శి సాజిద్‌, ఉపాధ్యక్షులు శివప్రసాద్‌, టీఏపీయూఎస్‌ రాష్ట్ర కో కన్వీనర్‌ వెంకటేశ్‌గౌడ్‌, ఎంఎస్‌టీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు క్రాంతికుమార్‌, సాత్విక్‌, రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, శ్రీనివాస్‌, జితేందర్‌, తిరుమలేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -