75 ఏండ్లు నిండితే రిలీవ్
పార్టీ జాతీయ మహాసభల్లో కీలక నిర్ణయాలు : సీపీఐ నేత కె.నారాయణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వయస్సురీత్యా పార్టీలో కీలక బాధ్యతల నుంచి తప్పుకున్నానని సీపీఐ నేత కె. నారాయణ అన్నారు. శనివారం నాడిక్కడ ఆయన మాట్లాడుతూ చండీగఢ్‌లో జరిగిన తమ పార్టీ జాతీయ మహాసభల్లో కీలక నిర్ణయాలు జరిగాయన్నారు. 75 ఏండ్లు నిండినవారిని రిలీవ్ కావాలని నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. నాయకత్వస్థాయి నుంచి పదవీ విరమణ చేశానని నారాయణ అన్నారు. పార్టీలో అంతర్గత సమస్యల పరిష్కారం కోసమే ఇకపై పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. సీపీఐ జాతీయ కార్యదర్శి రాజాకు మాత్రం సడలింపు పొడిగిస్తూ జాతీయ మహాసభల్లో నిర్ణయం జరిగిందని ఆయన తెలిపారు. మళ్లీ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాజా కొనసాగుతారని చెప్పారు. పార్టీలో అంతర్గత సమస్యలు ఉత్పన్నమైనప్పుడు వాటిని సక్రమంగా పరిష్కరించే ప్రక్రియ కోసం కంట్రోల్ కమిషన్ ఉందని ఆయన అన్నారు. పార్టీ కంట్రోల్ కమిషన్ చైర్మెన్‌గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని చెప్పారు.
వయస్సు రీత్యా బాధ్యతల నుంచి తప్పుకున్నా
- Advertisement -
- Advertisement -