9 గేట్లు ఎత్తి దిగువకు విడుదల
నవతెలంగాణ- కేతెపల్లి
ఎగువ ప్రాంతాల్లో ఉన్న హైదరాబాద్‌లోని ఉస్మాన్‌సాగర్, హుస్సేన్ సాగర్ రిజర్వాయర్ల నుంచి పెద్దఎత్తున వరద వస్తుండటంతో మూసీ ప్రాజెక్టు తొమ్మిది గేట్లను ఎత్తారు. శనివారం నల్లగొండ జిల్లా కేతెపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు 2, 3, 4, 5, 6, 7, 8, 10, 12 నెంబర్ల క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు 44922.31 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 643.10 అడుగుల వద్ద స్థిరంగా ఉంది. ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 4.46 పీఎంసీలు కాగా ప్రస్తుతం 3.96 టీఎంసీల నీరు నిలువ ఉంది. పరిస్థితిని ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నామని డ్యామ్ ఇంజినీర్లు డీఈ చంద్రశేఖర్, ఏఈ మమత, ఉదరు కుమార్, మధు చెప్పారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మూసీకి భారీగా పోటెత్తిన వరద నీరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES