Sunday, September 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి దేశ సంపద

కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి దేశ సంపద

- Advertisement -

రాజ్యాంగాన్ని, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకుందాం : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య
కల్వకుర్తిలో ఎల్‌ఐసీ-ఐసీఈయూ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ సెమినార్‌

నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి / కల్వకుర్తి
దేశ సంపద కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో పోగవుతోందని, ఈ క్రమంలో రాజ్యాంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య పిలుపునిచ్చారు. ఎల్‌ఐసీ-ఐసీఈయూ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ 33వ వార్షికో త్సవ జనరల్‌ బాడీ సమావేశాల సందర్భంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని టీఎస్‌ యుటిఎఫ్‌ భవనంలో శనివారం సెమినార్‌ జరిగింది. ”దేశ సమగ్రతలో భారత రాజ్యాంగం, ఆర్థిక ప్రగతిలో ప్రభుత్వ రంగం” అనే అంశంపై జరిగిన సెమినార్‌లో వీరయ్య ప్రసంగించారు. బీజేపీ పాలనలో కార్పొరేట్‌ సంస్థలు, అంబానీ, ఆదానీల ఆస్తులు భారీగా పెరిగాయని తెలి పారు. దేశంలో సంపద సృష్టించేది కార్మికులు అయితే.. ఆ సంపదను పోగేసుకునేది అంబానీ, ఆదానీ అని అన్నారు. కష్టపడి పనిచేసే అసంఘటిత రంగ కార్మికులు కనీస సౌకర్యాలు లేకుండా జీవిస్తున్నారని తెలిపారు.

పాలకులు మాయమాటలతో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేశం అభివృద్ధి కావాలంటే సంపద ప్రజల వద్దకు చేరాలని, దాని వల్ల ప్రజల్లో విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఆహారం, జీవన ప్రమాణ స్థాయి పెరుగుతాయని చెప్పారు. ప్రజల చేతిలో సంపద ఉంటే కొనుగోలు శక్తి, వినిమయ శక్తి పెరిగి దేశ అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. పాలకుల వ్యవహార శైలి వల్ల నిరుద్యోగం పెరిగిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను భారత రాజ్యాంగం కాపాడుతుంది కాబట్టి, మోడీ ప్రభుత్వం భారత రాజ్యాం గాన్ని రద్దు చేయాలని కుట్ర పన్నుతోందని చెప్పారు. ఇప్పటికే స్వతంత్ర ప్రతిపత్తిపై పనిచేస్తున్న ఎలక్షన్‌ కమిషన్‌, న్యాయవ్యవస్థ, సీబీఐ లాంటి సంస్థ లను తన గుప్పిట్లో పెట్టుకుని ప్రశ్నించేవారిపై అణచివేత చేపట్టిందని వివ రించారు. రాజ్యాంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడు కోవాల్సిన బాధ్య త ప్రతి పౌరుడిపైనా ఉన్నదని, దీనికి ఐక్య పోరాటాలే మార్గమని చెప్పారు.

అంతకు ముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌ఐసీ సౌత్‌జోన్‌ సంయుక్త కార్యదర్శి జి.తిరుపతయ్య, ఎల్‌ఐసీ-ఐసీఈయూ హైదరాబాద్‌ బ్రాంచ్‌ నాయకులు మధు కల్వకుర్తి బ్రాంచ్‌ అధ్యక్ష కార్యదర్శులు హుస్సేన్‌ పాషా, లక్ష్మణాచారి, కోశాధికారి నగేష్‌, స్రవంతి, నిరంజనమ్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.ఆంజనేయులు, ఆర్‌.శ్రీనివాసులు, టీస్‌యూటీఎఫ్‌ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు ఏపీ మల్లయ్య, సీనియర్‌ నాయకులు చిన్నయ్య, కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిజాల పరుశురాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చింత ఆంజనేయులు, రాజా, ఎల్‌ఐసీ ఏజెంట్స్‌ యూనియన్‌ నాయకులు తాళ్ల వెంకటయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -