నవతెలంగాణ – కంఠేశ్వర్
అమెరికాలోని హాస్టన్ సిటీలో మన తెలుగు వాళ్ళ బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ వేడుకలు అని అంటున్నారు మన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆడపడుచులు. మన తెలుగుజాతి గొప్పతనాన్ని చాటి చెబుతూ అమెరికాలోని హాస్టన్ సిటీలో స్థిరపడిన ఆడపడుచులు అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలను ఆట పాటలతో ఆడి బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. బతుకమ్మ…బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతకమ్మ ఉయ్యాలో అంటూ హుషారుగా పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మన తెలుగు వాళ్ళు పానుగంటి తేజస్వి, దివ్య, దీప్తి, మంజుల, దివ్యారెడ్డి, నియారెడ్డి, మేఘన, హరిప్రియ, మధురి పాల్గొనడంతో పాటు అక్కడి దేశానికి చెందిన మహిళలు చూసి మేము సైతం అంటూ వివిధ రకాల పువ్వులతో పేర్చి గౌరమ్మను ప్రత్యేక అలంకరణ తీర్చిదిద్ది అందరితో కలిసిఆటపాటలతో బతుకమ్మ ఆడారు.
అమెరికాలోని హాస్టన్ సిటీలో మన తెలుగు వాళ్ళ బతుకమ్మ సంబరాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES