Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చేనేత పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు 

చేనేత పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు 

- Advertisement -

మాజీ జడ్పిటిసి సభ్యులు, మాజీ ఆప్కో డైరెక్టర్ కర్నాటి వెంకటేశం
నవతెలంగాణ –
చండూరు 
చేనేత పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ రుణమాఫీ చేసింది అంటూ అసత్య ప్రచారాలు చేస్తుందని మాజీ జడ్పిటిసి సభ్యులు , మాజీ ఆప్కో డైరెక్టర్ కర్నాటి వెంకటేశం విమర్శించారు. ఆదివారం గట్టుప్పల్ లో విలేకరుల సమావేశం లో ఆయన పాల్గొని మాట్లాడారు.    ఇటీవల  శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంత్యుత్సవంలో  రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ , చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,  మా ప్రభుత్వం నేతన్నల సంక్షేమ పథకాలకు రూ.1000 కోట్లు కేటాయించాం, చేనేత కార్మికులకు రుణమాఫీ చేశాం అంటూ అసత్య ప్రచారం చేశారు అని  ఆయన విమర్శించారు.

సీఎం  చేనేత రుణమాఫీ ష్రకటించి ఏడాది గడిచినా రుణాలమాఫీపై మీద  మేషాలు లెక్కిస్తూ, దాటవేస్తూ ప్రచారంలో మాత్రం రుణమాఫీ చేశాం అంటూ ప్రగల్భాలు, చేస్తుందన్నారు.నేటి వరకు ఏ ఒక్క చేనేత కార్మికుడి రుణాలు, సహకార సంఘాల రుణాలు మాఫీ కాలేదన్నారు. చేనేత అభయహస్తం పథకం అంటూ నేతన్న భరోసా కింద ప్రకటించిన చేనేత కార్మికునికి రూ.18000/-, అనుబంధ కార్మికులకు రూ.6000/- నగదు జమ కాలేదన్నారు. కేవలం అవగాహన సదస్సుల పేరిట కాలయాపన చేయడం చేనేత కార్మికుల పట్ల ప్రభుత్వ నిబద్ధత ఏమిటో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. గత  ప్రభుత్వం ప్రవేశపెట్టిన యార్న్ సబ్సిడీ 40% పథకం రద్దు, తెలంగాణ మగ్గం పథకం ప్రతి జియోటాగ్ కార్మికునికి స్టాండ్ మగ్గాలు స్కీం రద్దు చేయడం జరిగిందన్నారు.

త్రిఫ్ట్ ఫండ్ పథకం ద్వారా నెల నెల కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం లేదన్నారు. కేవలం కాగితాలకే పరిమితమై కార్మికులకు మాత్రం మొండిచేయి మిగిలిందని  అన్నారు.మంత్రి  ష్రకటించిన రూ. 1000 కోట్లు ఏ ఏ పద్దుల కింద నిధులు విడుదల చేశారో చెప్పాలని  ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అవ్వారి శ్రీనివాస్, బీఆర్ఎస్ మర్రిగూడ మండల అధ్యక్షుడు తోటకూర శంకర్, మాజీ ఎంపిటిసి గొరిగి సత్తయ్య, అంతంపేట గ్రామ శాఖ హనుమంతు, నాయకులు పున్న కిషోర్, చిలుకూరి అంజయ్య, గంజి కృష్ణయ్య, పోరెడ్డి ముత్తిరెడ్డి, కర్నాటి శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు జూలూరు పురుషోత్తం, కార్యదర్శి చిలువేరు అయోధ్య, కుకుడాల వినోద్, పున్న ఆనంద్, చెరుపల్లి రమేశ్‌, నరేశ్‌, వెంకటేశం, శ్రీనివాస్, నవీన్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -