Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండలంలోని ఇటు మంజీరా నది అటు లేండి వాగు పరివాహ ప్రాంతాల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డోంగ్లి మండల ఆర్ ఐ సాయిబాబా మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొరలు పొంగుతుండడంతో డోంగ్లి మండలంలోని  పలు గ్రామాలను మండల తాసిల్దార్ ఆదేశాల మేరకు ఆర్ఐ సందర్శించి సమీక్షించారు లేండి నది, నిజాంసాగర్ కెనాల్ ప్రాజెక్టు భారీగా నీరు వదిలుతున్నారు. మండలంలోని చిన్న టాక్లి ,నుండి పెద్ద టాక్లి, వెళ్లే లోతట్టు ప్రాంతంలో నీరు భారీగా ప్రవహిస్తున్నందున ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. రాకపోకల విషయంలో ప్రజలకు తగు సూచనలు చేస్తూ నీటి ప్రవాహాన్ని పర్యవేక్షించిన  రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా, లింబూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివారెడ్డి, లింబూర్ గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -