నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 126వ మాన్ కీ బాత్ కార్యక్రమాన్ని సుభాష్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంఠేశ్వర్ మండల బిజెపి నాయకులతో కలిసి అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ వీక్షించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతీనీ ఉద్దేశించి గొప్ప సందేశంతో పాటు ముఖ్యమైన అంశాలను ప్రస్థావించడం జరిగిందన్నారు. దేశ ప్రజలందరు స్వదేశీ వస్తువులను ఉపయోగిస్తూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని మాన్ కీ బాత్ వేదికగా ప్రధానమంత్రి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా నినాదంతో దేశియా ఉత్పత్తులను ప్రోత్సాహిస్తూ సహకారం అందించారు అని అన్నారు. భారతీయ మహిళలు తమ నారీ శక్తితో వివిధ రంగాలలో చూపిస్తున్న ప్రతిభను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకునేల ఎదగడం గర్వకారణం అన్నారు.
నావి,ఎయిర్, రక్షణ,రంగాలతో పాటు గ్రామీణ స్థాయి మహిళలు సైతం చిన్న, చిన్న కుటీర పరిశ్రమలతో అభివృద్ధిని సాధిస్తున్నారని తెలిపారు. అయోధ్య రామ మందిర పునః నిర్మాణంతో హిందువులు చిరకాల స్వప్నం నెరవేరిందని గుర్తు చేసారు. దేశ ప్రజలకు గొప్ప బహుమతిగా మోడీ , జీఎస్టీ తగ్గింపులు చేసారని అన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఊరటను ఇచ్చే విదంగా ఉందని అన్నారు.ప్రముఖ లలిత కళ రంగాలలో పేరు పొందిన వారికీ ప్రోత్సాహంగా పద్మశ్రీతో గుర్తింపు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రముఖ గాయిని లత మంగేష్ కీ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల లక్ష్మీనారాయణ, జిల్లా సెక్రెటరీ జ్యోతి , మండల అధ్యక్షులు శక్తి కేంద్ర చార్జిలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.