Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐద్వా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు 

ఐద్వా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు 

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక 
“మతోన్మాదాన్ని ప్రతిఘటిద్దాం మహిళలకు అండగా నిలుద్దాం” అన్న నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా వాడ వాడ ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఆదివారం దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో.. ఐద్వా సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు సింగిరెడ్డి నవీన ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులచే క్లాసికల్ డాన్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలోని మహిళల సమస్యలపై ఐద్వా నిరంతర ఆందోళన కార్యక్రమాలు, పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా పలువురికి మాజీ ఎంపీటీసీ పోలబోయిన లక్ష్మీ నారాగౌడ్ చేతుల మీదుగా బహుమతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నాయకురాలు శశికళ, సుజాత, నర్మద, పలువురు మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -