నవతెలంగాణ – పెద్దవంగర
గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఎట్టకేలకు స్థానిక పోరుపై ఉత్కంఠ వీడింది. మండలంలోని ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ, వార్డుల వారీగా రిజర్వేషన్ ప్రక్రియను అధికారులు శనివారం ఖరారు చేశారు. 26 గ్రామాలకు 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్, 2024 కుల గనణాంకాల ఆధారంగా బీసీ రిజర్వేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. పెద్దవంగర ఎంపీపీ- బీసీ జనరల్, జెడ్పీటీసీ -ఎస్సీ జనరల్, పెద్దవంగర గ్రామ ఎంపీటీసీ- ఎస్సీ జనరల్, సర్పంచ్- బీసీ మహిళా, చిన్నవంగర ఎంపీటీసీ- ఎస్టీ మహిళా, సర్పంచ్- ఎస్సీ జనరల్ మహిళా, చిట్యాల ఎంపీటీసీ- ఎస్సీ జనరల్ మహిళా, సర్పంచ్- ఎస్సీ జనరల్, బొమ్మకల్ ఎంపీటీసీ- జనరల్, సర్పంచ్- బీసీ జనరల్, అవుతాపురం ఎంపీటీసీ- బీసీ జనరల్, సర్పంచ్- జనరల్, గంట్లకుంట ఎంపీటీసీ- బీసీ మహిళా, సర్పంచ్- బీసీ మహిళా, కొరిపల్లి ఎంపీటీసీ- ఎస్టీ జనరల్, సర్పంచ్- జనరల్, వడ్డెకొత్తపల్లి ఎంపీటీసీ- బీసీ జనరల్, సర్పంచ్- ఎస్సీ మహిళా, పోచంపల్లి ఎంపీటీసీ- బీసీ జనరల్, సర్పంచ్- ఎస్సీ జనరల్, కాన్వాయిగూడెం సర్పంచ్ – బీసీ జనరల్, పోచారం సర్పంచ్- బీసీ జనరల్, ఉప్పెరగూడెం సర్పంచ్- జనరల్ మహిళా, ఎల్బీ తండా సర్పంచ్- జనరల్, బీసీ తండా సర్పంచ్- జనరల్, ఒంపు తండా సర్పంచ్- జనరల్, బావోజి తండా సర్పంచ్ – జనరల్, కాండ్య తండా సర్పంచ్- మహిళా, రెడ్డికుంట తండా సర్పంచ్- మహిళా, రామచంద్రు తండా సర్పంచ్- జనరల్, బొత్తల తండా సర్పంచ్- జనరల్, టీక్య తండా సర్పంచ్- జనరల్, రామోజీ తండా సర్పంచ్- మహిళా, రాజమాన్ సింగ్ తండా సర్పంచ్- మహిళా, పడమటి తండా సర్పంచ్- మహిళా, జయరాం తండా సర్పంచ్- మహిళా రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. మండలంలో గతంలో 20 గ్రామాలు ఉండగా, ఇటీవల 6 తండాలు నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి. మండలంలోని 192 వార్డుల్లో మొత్తం 25,409 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో స్త్రీలు 12,898 మంది, పురుషులు 12,511 మంది ఓటర్లు ఉన్నారు.
స్థానిక పోరుపై వీడిన ఉత్కంఠ ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES