నవతెలంగాణ-పెద్దవంగర
కార్యకర్తలే పట్టుకొమ్మలని, కార్యకర్తలు అధైర్య పడొద్దని అన్ని విధాలా అండగా ఉంటామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మండల కేంద్రానికి చెందిన అనపురం లక్ష్మీనారాయణ (62) అనారోగ్యంతో మృతి చెందారు. జర్నలిస్ట్ దుర్సోజు రాజశేఖర్ తల్లి స్వరూప (56) ఇటీవల మృతి చెందారు. బాధిత కుటుంబాలను ఆదివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, సీనియర్ నాయకులు కేతిరెడ్డి సోమ నర్సింహారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, శ్రీరామ్ సుధీర్, నిమ్మల విజయ శ్రీనివాస్, చిలుక బిక్షపతి, రాంపాక నారాయణ, సతీష్, మహేష్, ప్రదీప్, రాజు, శంకర్, వెంకటనారాయణ తదితరులు ఉన్నారు
అధైర్య పడొద్దు.. అండగా ఉంటా: ఎర్రబెల్లి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES