- Advertisement -
గ్రూప్ లో మెరిసిన మండల వాసి
నవతెలంగాణ – పెద్దవంగర
మండలంలోని కాన్వాయిగూడెం గ్రామానికి చెందిన చెన్న ప్రణీత్ కుమార్ గ్రూప్ -2 ఫలితాల్లో 138 ర్యాంకు సాధించి, ఏఎస్ఓ గా ఎంపికయ్యారు. ఆదివారం ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో మొదటి ప్రయత్నంలోనే ఆయన ఏఎస్ఓ సాధించాడు. ప్రస్తుతం ఆయన జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. తల్లిదండ్రులు చెన్న నాగలక్ష్మి -సోమ నారాయణ వ్యవసాయ నేపథ్యమైనా ప్రణీత్ కుమార్ ను ఉన్నత చదువులు చదివించారు. ఎస్ఎస్సీ కొడకండ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ఇంటర్- హన్మకొండ, డిగ్రీ- గురుకులం, పీజీ- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించారు. కాగా గ్రూప్ -2 సాధించిన ప్రణీత్ కుమార్ ను గ్రామస్తులు అభినందించారు.
- Advertisement -