Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అపూర్వ సమ్మేళనం..

అపూర్వ సమ్మేళనం..

- Advertisement -

25 వసంతాల తర్వాత ఒకే వేదికపై పూర్వ విద్యార్థులు 
పాత జ్ఞాపకాలతో ఆనందోత్సవాలు 
నవతెలంగాణ-పాలకుర్తి

పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపూర్వంగా జరిగింది. 1999-2000 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం మండల కేంద్రంలో గల బషారత్ గార్డెన్ లో ఆత్మీయ సమ్మేళనాన్ని అపూర్వంగా జరుపుకున్నారు. 25 వసంతాల తరువాత పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై చేరి పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. 25 సంవత్సరాల ఎడబాటుకు బషారత్ గార్డెన్ వేదిక అయ్యింది. బాల్యంలో చేసిన మధురమృతులను గుండె నిండా గుర్తు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఆనాటి గురువులను పాదాభివందనం చేశారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంతో బషారత్ గార్డెన్ సందడిగా మారింది. జ్ఞానం నేర్పిన ఆనాటి గురువులు ఎం. సోమయ్య, సోమేశ్వర్ రావు, మహెందర్ రెడ్డి, యాదగిరి, డి. సోమయ్య, సత్య నారాయణ, ఆంజనేయులు లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు  చిలుకమారి నాగేశ్వర్, మామిండ్ల రమేష్ రాజా, జిలుకర తిరుమల్, చారగొండ్ల శివ,గంగు రఘు శర్మ, గుండెవేని కుమారస్వామి, ఆరూరి మహెందర్, జంపాల రాజు, దిలీప్, ప్రవీణ్, గాదెపాక శ్రీను, భాస్కర్, ఎడవెల్లి కృష్ణ, రేపాల అశోక్, సుమలత, రజిత, గుణవతి, సునీత, ప్రియాంక లతోపాటు పూర్వ విద్యార్థిని, విద్యార్థులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -