నవతెలంగాణ – చారకొండ
మండల కేంద్రంలోని దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జడ్పీహెచ్ఎస్ స్కూల్ గ్రౌండ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద అంగరంగ వైభవంగా పూజల నిర్వహిస్తున్నారు. దుర్గా దేవి వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తుండగా స్కూల్ గ్రౌండ్ లో నెలకొల్పిన అమ్మవారు కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఉదయం ప్రత్యేక పూజలు కుంకుమ అర్చనలు నిర్వహించడం జరిగింది. చింతపల్లి నారమ్మ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ నిర్వహించి అమ్మవారికి గులాబీ చీరతో పాటు జీరా రైస్, పులిహారా, స్వీట్ నైవేద్యాన్ని అందించారు. అమ్మవారికి పెద్ద మంగళహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని బతకమ్మలాడారు. గ్రామ ప్రజలు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES