నవతెలంగాణ – తొగుట
జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పుట్టిన నేలకు మంచి పేరు తెచ్చేలా కృషి చేయాలని తెలంగాణ ఉద్యమ కవి, గాయకుడు, సామాజిక కార్యకర్త బండకాడి గణేష్ అన్నారు. ఆదివారం కరీంనగర్ లో జరిగిన అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ నిఫా (నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్టిస్ట్, యాక్టివిస్ట్) సిల్వర్ జూబ్లీ అవార్డు ఫంక్షన్ లో భాగంగా సెంట్రల్ డిప్యూ టీ హోమ్ ఎఫైర్స్ మినిస్టర్ బండి సంజయ్ చేతుల మీదుగా అవార్డ్ అందుకున్నారు. ముందుగా నిఫా రాష్ట్ర అధ్యక్షులు కే. యాదవ రాజు, టీమ్ సభ్యు లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం మంత్రి బండి సంజయ్ చేతులమీదుగా అవార్డ్ అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. యువత చెడు వ్యసనా లకు బానిసై అనారోగ్యానికి గురౌతున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అమ్మ నాన్నల కు, సమాజానికి పెనుబారంగా మారకుండదని సూచించారు. మహనీయుల జీవితాలను స్ఫూర్తి గా తీసుకొని గొప్ప లక్ష్యాలను సాధించి సామాజిక దృక్పథంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.
బండకాడి గణేష్ కు నిఫా జిలా స్థాయి అవార్డు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES