నవతెలంగాణ – ధర్మసాగర్
చిన్ననాటి స్నేహం, బాల్యం, బడి గురుతులను నెమరు వేసుకునేందుకు ఏర్పాటు చేస్తున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికలు అంతులేని ఆనందాన్ని నింపుతాయని ఎంఈఓ రాందాన్ అన్నారు. ఆదివారంమూడు దశాబ్దాల అనంతరం 1991_92 పదో తరగతి విద్యార్థులు ధర్మసాగర్ మండలంలోని జిల్లా పరిషత్ నారాయణగిరి ఉన్నత పాఠశాలలో సందడి చేశారు. ఈ సందర్భంగా రోజంతా పాఠశాలలోనే గడిపి 30 ఏళ్ల మధురస్మృతులను నెమరు వేసుకున్నారు.తాము చదువుకున్న తరగతి గదులు బడి గోడలు ఆటపాటలు స్థలాలు అన్నింటిని సందర్శించి,పాతకాలపు జ్ఞాపకాలతో భావోద్వేగానికి లోనయ్యారు.
దాదాపు 50 మంది విద్యార్థిని విద్యార్థులు వివిధ దశలలో స్థిరపడి 30 ఏళ్ల తర్వాత తిరిగి పాఠశాలలో కలిసి వేడుకలు నిర్వహించుకోవడం పట్ల వారి కుటుంబ సభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.నారాయణగిరి పాఠశాల ఆవరణలో జరిగిన ఈ ఆత్మీయ సమావేశ వేడుకకు మండల విద్యాశాఖ అధికారి,రాంధన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ తిరిగిరాని బాల్యం, మరపురాని స్నేహం విలువలను వివరించారు.పాఠశాల అప్పుడు ఇప్పుడు ఒక చరిత్రను ఒక నేపథ్యాన్ని కలిగి ఉందని గుర్తు చేశారు.
కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు మధుసూదన్ రావు, బాసరి శ్రీనివాసరావు, మహేంద్ర చారి, మల్లికార్జునరావు, సరోజినీ దేవిల తోపాటు నారాయణగిరి పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిన్ననాటి ఆటలు పాటలు నెమరు వేసుకున్న విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శర్మ, శ్రీధర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సంపత్ రెడ్డి, రామకృష్ణ, విద్యాసాగర్, బాసిరి కవిత, కొంకటి అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మీయ కలయికలతో అంతులేని ఆనందం: ఎంఈఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES