Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అబుదాబిలో బతుకమ్మ సంబరాలు..

అబుదాబిలో బతుకమ్మ సంబరాలు..

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
తెలంగాణ సాంప్రదాయ పండుగ బతుకమ్మ సంబరాలు అబుదబిలో ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి( మండలంలోని అంకాపూర్ గ్రామానికి చెందిన,)  గెస్ట్ ఆర్టిస్ట్ గా వెళ్లిన ప్రముఖ కవి గాయకుడు నృత్యదర్శకుడు కోకిల నాగరాజు తన ఆటపాటలతో కార్యక్రమాన్ని ఉర్రూతలూగించాడు. నాగరాజు అక్కడి మహిళలతో పిల్లలతో రూపొందించిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంప్రదాయ నృత్యాలు కోలాటం నేర్పించి, చక్కటి వ్యాఖ్యానంతో అలరించిన  కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాగరాజుకు యూఏఈ భారత రాయబారి కార్యాలయ ముఖ్య అధికారి జార్జి జార్జ్ , తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజా శ్రీనివాసరావు  ఘనంగా సన్మానించారు. మూడు వేల మంది తెలంగాణ వాసులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంప్రదాయ వంటకాలు , సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా తెలంగాణ స్టాల్స్ ఏర్పాటు చేశారు. అబుదాబిలో బతుకమ్మ వేడుకల్లో ఐదవ సారి పాల్గొని విజయవంతం చేసినందుకు సంతోషంగా ఉందని నాగరాజు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -