Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాళం వేసి ఉన్న రెండు ఇండ్లలో చోరీ

తాళం వేసి ఉన్న రెండు ఇండ్లలో చోరీ

- Advertisement -

– తులం బంగారం, 15 తులాల 3వెండి గడియారాలు చోరీ
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని హాస కొత్తూర్  గ్రామంలో తాళం వేసి ఉన్న రెండు ఇండ్లలో చోరీ జరిగింది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆర్మూర్ నీలా రెండు రోజులకు ఇంటికి తాళం వేసి ఊరెళ్ళింది. శనివారం తాళం వేసి ఉన్న ఇంటిని గమనించిన దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డ దొంగలు బీరువా తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని వస్తువులను చిందర వందర చేసి, బీరువాలో దాచుకున్న తులం బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఆర్మూర్ నీలా ఇంటి పక్కనే ఉన్న చిటిమేల బాలయ్య ఇంటికి కూడా తాళం వేసి ఉండడంతో ఆ ఇంట్లో కూడా చోరీకి పాల్పడ్డారు.  ఇంటి తాళాన్ని పగలగొట్టి బాలయ్య ఇంట్లో నుండి 15 తులాల మూడు వెండి గడియారాలను ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు క్లూస్ టీం సభ్యులు చోరీ జరిగిన రెండు ఇండ్లలో దుండగుల వేలిముద్రలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ  అనిల్ రెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -