నవతెలంగాణ – కాటారం
ఆదివారం ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా ప్రాథమిక పశువైద్యశాల కాటారం వద్ద పశువైద్యాధికారి డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో పెంపుడు కుక్కలకు ఉచిత రేబిస్ నివారణ టీకాలు వేయడం జరిగింది. ఈ సందర్బంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ…రేబిస్ వ్యాక్సిన్ ని కనుగొన్న లూయిస్ పాశ్చర్ శాస్త్రవేత్త వర్ధంతి దినాన్ని ప్రపంచ రేబీస్ దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు.
యజమానులు తమ పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ వేయించుకోవడం అత్యవసరమని సూచించారు. పెంపుడు కుక్కల యజమానులకు యాంటీ రేవిస్ వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యతను, కుక్క కాటు వేసిన తర్వాత లేదా గోళ్ళతో గీరిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం జరిగింది. తమ పెంపుడు కుక్కలకే కాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వేయించుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ జి. రమేష్, పశువైద్య సహాయకులు తుంగల రాజశేఖర్ పాల్గొన్నారు.
పెంపుడు కుక్కలకు ఉచిత రేబిస్ టీకాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES