- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పట్టణంలోనీ జగదేపూర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం నిత్య కృత్యమయ్యాయి ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీల మధ్య కారు నుజ్జు నజ్జాయింది. తుర్కపల్లి వైపు నుంచి ఒక కారు జగదేవపూర్ చౌరస్తా వైపు వస్తుంది. ఈ క్రమంలో అదే వైపు నుంచి వచ్చిన వచ్చిన లారీ కారును వెనక నుంచి ఢీ కొట్టింది. దీంతో కారు ముందు ఉన్న లారీని ఢీ కొట్టింది. రెండు లారీల మధ్య కారు ఇరుక్కుపోయింది. కారు ముందు వెనక భాగాలు దెబ్బతిన్నాయి. గత రెండు నెలలుగా జగదేవపూర్ చౌరస్తా వద్ద ప్రమాదాల పరంపర కొనసాగుతుంది. ఈ ప్రమాదాలను చూసిన వాహనదారులు, పట్టణ ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు.
- Advertisement -