Monday, September 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అన్నదానం పుణ్య ఫలాన్నిస్తుంది ..

అన్నదానం పుణ్య ఫలాన్నిస్తుంది ..

- Advertisement -

– యువ నాయకులు కుక్కడాల సాయి ప్రకాష్ నేత
నవతెలంగాణ – హాలియా
హాలియాలోని దుర్గామాత మండపం వద్ద ఆదివారం ఈ కార్యక్రమానికి అన్నదాతగా విద్యావేత్త సీనియర్ జర్నలిస్ట్ కుక్కడాల చంద్రమౌళి జ్ఞాపకార్థం, ఆయన కుమారుడు యువ నాయకులు కుక్కడాల సాయి ప్రకాష్ ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా సాయి ప్రకాష్ మాట్లాడుతూ.. “దేవి దుర్గామాత అనుగ్రహంతోనే అన్నీ సాఫల్యమవుతాయి. సమాజంలో ప్రతి ఒక్కరూ సద్వ్యవహారాలతో ముందుకు సాగాలన్నది అమ్మవారి ఆశీస్సు. ఇలాంటి మహోత్సవాల్లో పాల్గొని సేవ చేయడం పుణ్యఫలాన్నిస్తుంది” అని అన్నారు. అలాగే అమ్మవారిని శ్రద్ధగా ఆరాధించిన ప్రతి ఒక్కరికీ ఆత్మశాంతి, కుటుంబ సౌఖ్యం కలుగుతాయి. దసరా పర్వదినాలు ధర్మబద్ధమైన జీవనానికి మార్గదర్శనం చేస్తాయి. అమ్మవారి సేవలో భాగంకావడం ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక తృప్తి ఇస్తుంద‌ని తెలిపారు.కార్యక్రమంలో కె.ఎస్ యూత్ సభ్యులు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -