Monday, September 29, 2025
E-PAPER
Homeదర్వాజపండక్కు మా ఊరెళ్ళి రావాలి..!

పండక్కు మా ఊరెళ్ళి రావాలి..!

- Advertisement -

దసరా వస్తోంది అంటేనే
అమత స్మతులు నన్నెత్తు కుంటాయి
మా ఊరు ఊరంతా నన్నత్తు కుంటుంది
పుట్టిన ఊరు అమ్మతర్వాత అమ్మే
పండక్కు మా ఊరు ఓ తీరు
వాడ వాడలా బతుకమ్మలతో
పూల గోపురమౌతది
దసరా సందళ్లకు సరదాలను తొడుక్కుని
మైసూరు లెక్క ముస్తాబైతది
ఊర్లోని గలుమలన్నీ రంగులద్దుకుని
ముత్తయిదవ లెక్క ముచ్చట గొలుపుతై
భారతీయ ఇతిహాసాలు
ఊరు గుమ్మానికి తోరణాలైతాయి
దేవతా మూర్తులు
షావాలెక్కి వెలుగు జిలుగుల్లో ఊరంతా ఊరేగుతాయి
జమ్మి బంగారం ఇచ్చి పుచ్చుకుంటూ
ఆత్మీయ కరచాలనాలు ఆలింగనాలూ
గుండెను ఆనంద అశ్రువుల్లో ముంచుద్ది
సెలవులు సరదాలకు నెలవులౌతాయి
నెలరోజుల ముందునుంచే
రథాల తయారు పుటలు పుటలుగా
ఓ చారిత్రిక ఘట్టాన్ని తెరుస్తుంది
సుదూర తీరాలనుంచి
ఊరు ప్రేమను కప్పుకున్న మనసులు
పాలపిట్టల్లా రెక్కలు కట్టుకు వాలుతాయి
కొత్త బట్టల్ని తొడుక్కున్నట్టు
ఊరు పాత సొపతుల్ని సైతం
కొంగ్రొత్తగా అలంకరించు కుంటది
ఊరంటే ఉత్తఊరు కాదండోరు
నల్లబంగారు సింగారాన్ని
చమట చుక్కల సౌందర్యాన్ని
కళల పొత్తిళ్ళలో దాచుకున్న చిత్కళ మా ఊరు
ఊరు సమీపాన కోటమైసమ్మ ఉత్సవం
ఊరుకు కొంగుబంగారమైతది
ప్రభలు ప్రభలుగా జాతర
గగన మెక్కుతుంది
దసరా సంబురాలు అంబరాన నిలిచి
ఊరును రంగుల రాట్నం లెక్క
గిర్రు గిర్రున తిప్పి
ఊయల పాటల ఊపును తెస్తది
పండుగంటే మా ఊరే.. మా ఊరే ఓ పండుగ..!

  • డా||కటుకోఝ్వల రమేష్‌, 9949083327
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -