Monday, September 29, 2025
E-PAPER
Homeసినిమాఇది అసలైన ఆరంభం..

ఇది అసలైన ఆరంభం..

- Advertisement -

చిరంజీవి నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్‌ కథానాయకుడిగా దిగ్విజయంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘చిరుత’తో హీరోగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన రామ్‌చరణ్‌ తనదైన నటన, డాన్స్‌, ఫైట్స్‌తో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వద్ధి సినిమాస్‌ బ్యానర్‌ పై వెంకట సతీష్‌ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.జాన్వీ కపూర్‌ కథానాయిక.

రామ్‌చరణ్‌ వెండితెరకు పరిచయమై 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ‘పెద్ది’ టీమ్‌ స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. ‘మా ‘పెద్ది’ 18 ఏళ్ళ సినీ కెరీర్‌ను పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషం. తెరపై ఘనమైన వారసత్వం కొనసాగిస్తూనే బయట ఎంతో వినయ విధేయతలు కలిగి ఉండటమే కాకుండా, తనకంటూ ఓ ప్రత్యేకమైన పంథాను ఏర్పాటు చేసుకున్నాడు. మాకెన్నో అద్భుతమైన ఉత్సాహాన్ని కలిగించే సందర్భాలను ఇచ్చాడు. ‘పెద్ది’ నుంచి చాలా పెద్ద సర్‌ప్రైజ్‌లు మొదలు కాబోతున్నాయి. ఇది అసలైన ఆరంభం మాత్రమే’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న రామ్‌ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ కానుంది.

చరణ్‌బాబు, 18 ఏళ్ళ క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంత గానో సంతోషిస్తున్నా. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండిస్టీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడూ గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభి మానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ.. విజయోస్తు.
‘ఎక్స్‌’ వేదికగా చిరంజీవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -